విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్...
ఆంధ్రాలో విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ పచ్చజెండా ఊపారు. తాజాగా తాడేపల్లి గూడంలో జరిగిన సమీక్ష సమావేశంలో మెట్రో రైల్ మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదనలపై సీఎం ఆరా తీయడం జరిగింది. పలు నగరాల్లో ఉన్న మెట్రో రైల్ మోడళ్లను అధికారులు సీఎం జగన్‌కు చూపించడం జరిగింది. 2020-24 మధ్య మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. మంచి నిర్మాణ శైలిని ఎంపిక చేసుకోవాలని సీఎం అధికారులను కోరడం జరిగింది. కోచ్‌ల నుంచి స్టేషన్ల నిర్మాణం వరకూ అత్యుత్తమ విధానాలను పాటించాలని, ముంబై మెట్రో పిల్లర్ డిజైన్‌ను పరిశీలించాలని సలహా ఇవ్వడం జరిగింది. ప్రతి స్టేషన్ వద్ద, ప్రధాన జంక్షన్ వద్ద పార్కింగ్‌కు స్థలాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తెలియజేయడం జరిగింది..
విశాఖపట్నం మెట్రోరైల్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై సీఎం జగన్ కు అధికారులు తెలిపిన వివరాలు ఇవే...
10 విడతలు, 10 కారిడార్లు
మెట్రోరైల్ మొత్తం మార్గం 140.13 కి.మీ.
ఫస్ట్ ఫేజ్ మొత్తం 46.40 కి.మీ
స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది 34.23 కి.మీ
గురుద్వార – ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ 5.26
తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్ 6.91 కి.మీ
2020 –2024 మధ్య పూర్తిచేయాలని ప్రతిపాదన
ఇక విశాఖ మెట్రోరైల్ వస్తే బాగుంటుంది అని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబందించి అన్ని వివరాలు కూడా సీఎం జగన్ పరిశీలించడం జరిగింది. ఈ ప్రాజెక్టుతో ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చు అని అధికారులు వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రయాణం చేసే సమయాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. మొత్తానికి విశాఖ వాసులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి